ఫేక్ ఏఐ వీడియోతో ప్రభుత్వంపై కుట్ర.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ డిమాండ్

ఫేక్ ఏఐ వీడియోతో ప్రభుత్వంపై కుట్ర.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కాటారం (భూపాలపల్లి): ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, మేడిగడ్డ బ్యారేజీ కూల్చివేతకు కుట్ర పన్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఫేక్‌ ఏఐ ఆధారిత వీడియోను సృష్టించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ కుంభం రమేష్‌ ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిందని, నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కుట్ర ఆరోపణలు చేయడం నీతిమాలిన చర్య అని రమేష్‌ విమర్శించారు. ఇలాంటి తప్పుడు వీడియోల ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడంతో పాటు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి, రాజకీయ పార్టీలు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం ద్వారా ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచి, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోల సృష్టి వెనుక బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకుల ప్రమేయం ఉందనే అనుమానాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ కుంభం రమేష్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్లు, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సదరు వీడియో, సందేశాలను వివిధ సోషల్‌ మీడియా గ్రూపుల్లో వైరల్‌ చేసిన మానేం రాజబాబుతో పాటు ఇతరులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ప్రజలు సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా, వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని కుంభం రమేష్‌ కోరారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్