ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం

ఎస్సీ, ఎస్టీల హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన

 ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం

బిచ్కుంద  :  ఫత్లాపూర్ గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిచ్కుంద మండల తహసీల్దార్  వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ ప్రజలకు పౌర హక్కులు, రాజ్యాంగం కల్పించిన రక్షణలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, వాటి పరిరక్షణకు అమలులో ఉన్న చట్టాల గురించి వివరంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సమానత్వ భావనతో మెలగాలని తెలిపారు. సమాజంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం ఉండాలని, కులం ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని వివరించారు.

ఎస్సీ, ఎస్టీలపై జరిగే అన్యాయాలు, దాడులు, వివక్ష వంటి ఘటనల విషయంలో చట్టపరమైన రక్షణలు అందుబాటులో ఉన్నాయని, బాధితులు భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామస్థాయిలో పౌర హక్కుల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జంగం రాజ్ కుమార్, వార్డు సభ్యుడు గంగాధర్, బిచ్కుంద మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ హన్మాండ్లు, గ్రామ కార్యదర్శి పద్మ, విలేజ్ అడాప్ట్ పోలీస్ అధికారి పవన్, జీపీఓ కాశిరాం, గ్రామ పెద్దలు బాబా సేట్, యువకులు కలపవర్ రాజు పటేల్, లక్ష్మణ్ చారి, సాయికిరణ్, ఆనంద్, కిరణ్ నిరుడి, హనుమాన్లు, లింగూరం తదితరులు పాల్గొన్నారు.

పౌర హక్కులపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో  రాణించాలి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి
మక్తల్ :  తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ అగర్వాల్, పిఎన్. వెంకటేష్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఈ...
నవంబర్ 5నుండి కేంద్రమంత్రి బండి సంజయ్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
ఓట్ బచావో – దేశ్ బచావో సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు
వట్టెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన సర్పంచ్ జ్యోతి శంకర్ మరియు బీజేపీ మండల నాయకులు
టీజీఎస్nఆర్టీసీ రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై శిక్షణ కార్యక్రమం
ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
స్క్రాప్ దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి