ఢిల్లీ ప్రజాస్వామ్య పరిరక్షణ మహా ర్యాలీకి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు:

జెండా ఊపి ప్రారంభించిన బండి రమేష్,

ఢిల్లీ ప్రజాస్వామ్య పరిరక్షణ మహా ర్యాలీకి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ప్రజల ఓటు హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోందని నిరసిస్తూ, అగ్రనేత  రాహుల్ గాంధీ సాగిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి మద్దతుగా నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ పంటలనైనా జిల్లా కలెక్టర్ ఐ ఎన్ డి ఐ ఏ కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.ఈ మహా ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్  ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సుల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు.

ఈ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ప్రత్యేక బస్సులకు బండి రమేష్ స్వయంగా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సాగనంపారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ  చేస్తున్న పోరాటానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్: 20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్:
ఉమ్మడి నల్లగొండ బ్యూరో : అకస్మాత్తుగా మాట కోల్పోవడం,కుడిచెయ్యి, కుడికాలు కదలకపోవడం వంటి తీవ్ర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన 20 ఏళ్ల యువతికి హైదరాబాద్ మలక్ పేట్...
SIRపై అపోహలను తొలగించి ప్రజలకు వాస్తవాలు వివరించాలి
కరువు పరిస్థితులపై కలెక్టర్ సమీక్ష: ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
జుక్కల్‌లో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపలేని కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
చౌటకూర్ మండలంలో ఘనంగా ప్రారంభమైన ‘అభివృద్ధి పనుల రథయాత్ర’