నల్లబెల్లిని కరువు మండలంగా ప్రకటించాలి.
నల్లబెల్లిని కరువు మండలంగా ప్రకటించాలి.
మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నల్లబెల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ వరంగల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి కోరారు. సోమవారం నల్లబెల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి కడియాల క్రాంతికుమార్‌తో కలిసి అధికారులకు మెమోరాండం సమర్పించారు.
వర్షాభావంతో ఆహార, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని, సాగు చేసిన పంటలకు సరిపడా నీరు అందక కొన్ని పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి కూడా తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్టోబర్ 31న రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, ఆ నివేదికలో నల్లబెల్లి మండలాన్ని చేర్చాలని కోరారు. ఇందుకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని సేకరించి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపేలా మండల అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించి రైతాంగాన్ని ఆదుకోవడంతోపాటు ప్రజల కనీస అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

