ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి......కొండేటి శ్రీను సిపిఐఎం జిల్లా కమిటి సభ్యులు....
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రతినిధి : అఖిలభారత 36 వ రైతు మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరుగుతున్న సందర్భంగా వెంగన్న గూడెం,పార్వతిపురం,రాజన్న గూడెం,మర్లగడ్డ క్యాంపు,వడ్డెర గూడెం,వల్లభవపురం,ఇండ్ల కోటయ్య గూడెం గ్రామాలలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను మాట్లాడుతూ నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం, వలస వాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1936లు అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఆవిర్భవించి నేటికి 90 సంవత్సరాల అవుతున్నది,ప్రపంచ గుర్తింపు పొందిన వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటాల పురిటి గడ్డ నల్లగొండలో మొట్టమొదటిసారిగా అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నవంబర్ 15 నుండి 18వ తేదీ వరకు జరుగుతున్నాయని,15వ తేదీన ఎన్జీ కళాశాల మైదానంలో లక్షలాది మంది రైతులతో భారీ ప్రదర్శన,బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు దేశ నలుమూలల నుండి 1500 మంది రైతు ఉద్యమ నేతలు ప్రతినిధులుగా వస్తున్నారని ఈ మహాసభలలో రైతంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి,భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటారని తెలిపారు,
గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలకు రేషన్ షాపుల్లో 18 రకాల నిత్యవసర సరుకులు సరఫరా చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు కరువులో ఇప్పుడు ఇస్తున్న బియ్యంతో పాటు చెక్కర ఛాయా పత్తా నూనె 18 రకాల నిత్యవసర సరుకులని పేదవాళ్లకు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు భరోసా రైతు బీమా రైతులకు రుణమాఫీ చేయాలనీ,గ్రామాలలో ఉన్న స్థానిక సమస్యలు నీరు పరిశుద్ధం శానిటేషన్ విద్య వైద్యం ప్రజా పాలనలో పూర్తి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం వేగవంతం చేసి ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఉపాధి హామీ పనులను మండలంలో అన్ని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని కోరారు.నవంబర్ 15వ తేదీన ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు రైతులు కార్మికులు యువకులు మహిళలు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కుంచెం శేఖర్ వరలక్ష్మి, ధనమ్మ, శ్రీను, శ్రీధర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

