గుంతల మయంగా ప్రధాన రహదారి
-తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ నుండి జాలిగామ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి తీవ్ర అద్వానంగా తయారైంది. రహదారి పొడవునా పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఈ గుంతల్లో నీరు చేరిపోవడంతో రోడ్డుపై గుంతలు ఎక్కడున్నాయో తెలియక ద్విచక్ర వాహనదా రులు, ఇతర ప్రయాణికులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు చేరి గుంతలు కనిపించక పోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ రహదారిపై రాకపోకలు నరకప్రాయంగా మారింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ఆర్ అండ్ బి విభాగం మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, యుద్దప్రాతిపదికన ఈ రహదారికి మరమ్మతులు చేపట్టి, గుంతలను పూడ్చివేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని స్థానిక ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Views: 25
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
