భారీ వర్షాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తహసీల్దార్ నామాల కిష్టయ్య
చౌటకూర్, జూలై 30: మండల పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చౌటకూర్ తహసీల్దార్ నామాల కిష్టయ్య సూచించారు. వర్ష తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. తాసిల్దార్ జారీ చేసిన ముఖ్యమైన సూచనలు: విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త: భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకూడదు. తెగిపడిన విద్యుత్ తీగలను, స్తంభాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తాకరాదు. చెట్ల కింద నిలబడరాదు: వర్షంతో పాటు భారీ గాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ఎవరూ చెట్ల కింద నిలబడకూడదు. ప్రజలు ముందస్తు అప్రమత్తతతో ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని ఈ సందర్భంగా తహసీల్దార్ పేర్కొన్నారు.
Views: 29
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
