రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని : ఎస్పీ ఆదేశించారు.
భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ సూచించారు. రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో-లెవల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లవద్దని సూచించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయరాదని, ప్రజల భద్రత కోసం వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ బ్రిడ్జిల వద్ద జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ కోరారు. ప్రజలకు పోలీసు శాఖ సూచనలు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగవద్దు. చేపల వేట కోసం వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లవద్దు.నీటిలో మునిగిన కల్వర్టులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దు. పశువులను మేతకు తీసుకెళ్లేటప్పుడు, వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించవద్దు. అత్యవసరం కాని దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించవద్దు.సెల్ఫీలు, రీల్స్ కోసం వరద ప్రాంతాలు, వాగులు, చెరువులు, జలపాతాల వద్దకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దు. జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, విపత్తు నిర్వహణ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
Views: 12
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
