విద్యార్థులే దేశ భవిష్యత్తు

విద్యార్థులే దేశ భవిష్యత్తు

  • కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగండి 
  • ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఉద్బోధన

చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):  మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆకస్మికంగా సందర్శించారు, ఈ పర్యటనలో భాగంగా ఆయన తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. వారి చదువుల గురించి అడిగి తెలుసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని ఉద్బోధించారు, ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాము కూడా సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించామని తెలిపారు, పట్టుదల కఠోర శ్రమ ఉంటే జీవితంలో ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన తన స్వయానా ఉదాహరణ ద్వారా వివరించారు, సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే తాను వైద్య వృత్తి నుండి ప్రజా జీవితంలోకి ప్రవేశించి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని గుర్తుచేశారు,విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలని జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం పాఠశాలలోని వంటశాలను భోజన హాల్‌ను ఆయన పరిశీలించారు, విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలని వంటశాల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పరిశుభ్రతను పాటించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు,పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన పాఠశాల ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి ఆరా తీశారు, వసతుల కల్పనలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వందన, చర్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజ్ వర్మ, సబ్ ఇన్‌స్పెక్టర్ నర్సిరెడ్డి,స్థానిక మండల అధికారులు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు