అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గజ్వేల్ సీఐ రవికుమార్

అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గజ్వేల్ (సిద్దిపేట) :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల వ్యాప్తంగా అకాల వర్షాలు, ఈదురుగాలులు కురుస్తున్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గజ్వేల్ సీఐ రవికుమార్ సూచించారు. వర్షాల ప్రభావంతో ఏమైనా సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని ఆయన తెలిపారు. కూలిపోయే ప్రమాదం ఉన్న పాత ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, చెట్ల కింద నిలబడకూడదన్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉన్నం దున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లరాదన్నారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, కల్వర్టులను దాటే ప్రయత్నం చేయకూడదన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీసు యంత్రాంగం మరియు అత్యవసర సేవలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా లేదా ఆపద వచ్చినా వెంటనే డయల్ 100కి కాల్ చేయాలన్నారు.
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు