జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోంది?

బైకు ర్యాలీతోనిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు

జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోంది?

గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులుపార్స్ హనుమాన్లు, కొమిరిశెట్టి తిరుపతి, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి బైకులతో భారీ బైక్ నిరసన కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువలు, ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్  నాయకులు మాట్లాడుతూ, “ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ఆయనను ఎందుకు రక్షిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు.
 ప్రజాస్వామ్య పరిరక్షణకు పాలకులు ఇకనైనా తమ వైఖరిని మార్చుకోవాలని, ప్రజల మనోభావాలను గౌరవించాలని ప్రార్థించారు. “ప్రజల ఓటు విషయంలో ఇకనైనా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థలు ప్రజల పక్షాన నిలబడాలి” అని కోరారు. ఒకరి ఓటు హక్కు ప్రశ్నార్థకమైతే, రేపు మరొకరి హక్కు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుంది” అని తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలని, ఎన్నికల కమిషన్ పనితీరుపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ భారీ బైక్ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

Views: 64

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత