మానసిక దివ్యాంగుల ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తున్న స్నేహ సొసైటీ.
స్నేహ సొసైటీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. ముఖ్యఅతిథిగా హాజరైన నగర మేయర్ కూరగాయల ఉమారాణి. మహనీయుల వేషధారణలో అద్భుత ప్రతిభ కనబరిచిన మానసిక దివ్యాంగులు.
నిజామాబాద్ : మానసిక దివ్యాంగుల ఉజ్వల భవిష్యత్తుకు స్నేహ సొసైటీ బంగారు బాట వేస్తుందని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీలో ఘనంగా బాలల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మేయర్ కూరగాయల ఉమారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీలోని మానసిక మహనీయుల వేషధారణలో దేశభక్తి ఉట్టిపడేలా ప్రదర్శించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. చిన్నారుల విన్యాసాలను, వారి ప్రతిభ పాటవాలను ప్రత్యక్షంగా వీక్షించిన వక్తలు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, దేశ ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి నేటి బాలల ఉజ్వల భవిష్యత్తుపై ఆధారపడి ఉందని ఆమె అన్నారు. సాధారణ వ్యక్తుల మాదిరిగా మానసిక దివ్యాంగులు తమ అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శించడం వారి ఉన్నతికి నిదర్శనం అన్నారు. మానసికంగా కృంగిపోతున్న వారిలో స్నేహ సొసైటీ ముందుకు వచ్చి వారికి సేవలు అందిస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ కి సంబంధించిన మానసిక దివ్యాంగులు దేశభక్తి గీతాలు దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమ అనంతరం మానసిక దివ్యాంగులకు నగర మేయర్ కూరగాయల ఉమారాణి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ కోశాధికారి తాటి సుధాకర్, వినయ, టాటా ఏఐఏ కు సంబంధించిన ప్రతినిధులు శ్రావణి నరేష్ రావు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


