జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
- పలు విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించి సత్తా చాటిన విద్యార్థులు - పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్రావు, ఉపాధ్యాయ బృందం,విజేతలను అభినందించారు.
మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడోత్సవాలు-2026లో మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు.వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు సాధించిన విజయాలు ఇలా ఉన్నాయి. అండర్-17 బాలుర కబడ్డీ విభాగంలో సిల్వర్ మెడల్, అండర్-17 అథ్లెటిక్స్ విభాగంలో కే. సాయి గోల్డ్ మెడల్ సాధించారు. అండర్-14 బాలుర లాంగ్ జంప్‌లో రామ్ చరణ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.అలాగే అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగు పందెంలో బాలికల విభాగంలో యశస్విని గోల్డ్ మెడల్, తేజస్విని సిల్వర్ మెడల్ సాధించారు. బాలికల లాంగ్ జంప్‌లో యశస్విని మరో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. అండర్-17 బాలుర షాట్‌పుట్ విభాగంలో గణేష్ సిల్వర్ మెడల్ సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థులు జిల్లాస్థాయిలో పతకాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావడంపై పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్రావు, ఉపాధ్యాయ బృందం, పేరెంట్స్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


