డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ యం.బాలస్వామి అరెస్ట్..!
- పెళ్లి పేరుతో మోసం చేసాడని మహిళ ఫిర్యాదు - కేసు నమోదు చేసిన పోలీసులు..!
హైదరాబాద్ : ప్రస్తుతం ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్‌లో డీఐగా పనిచేస్తున్న బాలస్వామిపై పోలీసులు కేసు నమోదు చేసారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా వాడుకున్నాడని ఆరోపిస్తూ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 2017 నుంచి పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. భర్త మరణించిన తర్వాత కూడా పెళ్లి హామీ ఇచ్చి తనతో సంబంధం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. అయితే పెళ్లి చేసుకోవాలని నిలదీయగా నిరాకరించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నది,దీంతో సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో
బీఎన్‌ఎస్‌లోని 69, 81, 351(2), 352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. .

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


