బీరంగూడలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. కమలం జెండా ఎగురవేస్తా: ఈర్ల రాజు ముదిరాజ్.
బీరంగూడ డివిజన్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ తెలిపారు.
బీజేపీ డివిజన్ అధ్యక్షుడిగా నియమితులైన ఈర్ల రాజు ముదిరాజ్‌ను కిష్టారెడ్డిపేటలోని రెయిన్బో మెడోస్ కాలనీ సొసైటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై అభిమానం చూపించి సన్మానించిన కాలనీ సొసైటీ నాయకులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పారు. ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం కల్పిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీకి ప్రజాదరణ పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలపరిచే అభ్యర్థి విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదాలు, కార్యకర్తల కృషితో బీరంగూడ డివిజన్లో కమలం జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
సన్మాన కార్యక్రమంలో రెయిన్బో మెడోస్ కాలనీ మాజీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అశోక్ చౌదరి, ట్రెజరర్ ఉమామహేశ్వర్, జాయింట్ సెక్రటరీ మురళి, మాజీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, బీజేపీ నాయకులు విశ్వనాథం, సృజన్ గౌడ్, అనిల్, ప్రవీణ్ కుమార్, డి. అనిల్ కుమార్, వెంకటేష్, సంతోష్ కుమార్, సుధీర్, సతీష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


