చండీ యాగంతో లోక కల్యాణం
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో జోస్యం వినయ్ శర్మ ఆధ్వర్యంలో సోమవారం చండీయాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా వినయ్ శర్మ మాట్లాడుతూ చండీ యాగం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. దుర్గాదేవిని మహాశక్తి స్వరూపిణిగా పూజిస్తూ నిర్వహించే చండీ యాగం ద్వారా లోకకల్యాణం, శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


