చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే వీడీసీలపై చర్యలు తప్పవు

ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఏడాది కాలంలో 13 కేసులు నమోదు.. 47 మందిపై కేసులు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదు – డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే వీడీసీలపై చర్యలు తప్పవు

 ఆదిలాబాద్:ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో  వీడీసీలు చట్టపరిధిలోనే పనిచేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అనధికార అనుమతులు ఇస్తూ వాటిని ప్రోత్సహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు.గత ఏడాది కాలంగా ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి 13 కేసులు నమోదు చేసి, 47 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వీడీసీలు బెల్ట్ షాపుల నిర్వహణకు, ఇసుక అక్రమ రవాణాకు, లైసెన్స్ లేని కల్లు దుకాణాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అనధికార అనుమతులు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సంక్షేమానికి సహకరించాల్సిన కమిటీలు చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడం సరికాదని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరిధిలో సంబంధిత పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి అండగా నిలిచినా, అక్రమ కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చినా, వాటిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములైనా బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి కోరారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హక్కుల కోసం ఉద్యమించాలి హక్కుల కోసం ఉద్యమించాలి
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి  పూజ ఉత్సవాలు
అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 
అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,