హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌లో నూతన దుకాణాలు, సిబ్బంది వసతి గృహం ప్రారంభం

ముఖ్య అతిథిగా పాల్గొన్న పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌లో నూతన దుకాణాలు, సిబ్బంది వసతి గృహం ప్రారంభం

కూకట్‌ పల్లి : శంషిగూడ, హైదర్‌నగర్ డివిజన్ల పరిధిలోని హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దుకాణాలు, సిబ్బంది వసతి గృహాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో నూతన దుకాణాలు, సిబ్బంది వసతి గృహం అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. సిబ్బందికి వసతి సౌకర్యం కల్పించడం అభినందనీయమని, నూతనంగా నిర్మించిన వసతి గృహం సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రత్న ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఎం. బాబు రావు, ప్రధాన కార్యదర్శి ఎం. యాది రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు వి. వెంకటరావు, ఎస్. రామనాధంతో పాటు హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, శ్రీ ఉమా మహేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హక్కుల కోసం ఉద్యమించాలి హక్కుల కోసం ఉద్యమించాలి
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి  పూజ ఉత్సవాలు
అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 
అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,