అన్నపూర్ణాదేవిగా అమ్మవారి అలంకరణ

వైభవంగా శరన్నవరాత్రి మూడో రోజు పూజలు

అన్నపూర్ణాదేవిగా అమ్మవారి అలంకరణ

నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): శ్రీ వాగ్దేవి యువజన కళా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు ఆచార్య గణేష్ శర్మ ఆధ్వర్యంలో ధూప, దీప, నైవేద్యాలతో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు.అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని భక్తులు ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమంలో కడియాల సిరి–ప్రవీణ్ కుమార్ దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వాగ్దేవి కళా సంస్థ గౌరవ అధ్యక్షుడు సామల వీరన్న, అధ్యక్షుడు రఘుశాల ప్రదీప్, మాజీ అధ్యక్షుడు ఉడత భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఉడుత దినేష్, కోశాధికారి చింత వెంకన్న, రంజిత్, కోటిలింగాచారి, జై కిషోర్, మాలధారణ భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.

Views: 251

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హక్కుల కోసం ఉద్యమించాలి హక్కుల కోసం ఉద్యమించాలి
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి  పూజ ఉత్సవాలు
అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 
అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,