కాషాయ జెండాలకు రూ.25,016 విరాళం - కల్వకుర్తిని కాషాయమయం చేసిన బీఆర్ఎస్ నేత
కల్వకుర్తి: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణాన్ని కాషాయమయం చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బావండ్ల మధు, కౌన్సిలర్ బావండ్ల మంజుల సోమవారం ఉదారత చాటుకున్నారు. కాషాయ జెండాల ఏర్పాటు కోసం రూ.25,016 విరాళాన్ని హిందూ ఐక్యవేదిక సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ సంప్రదాయంలో కాషాయ రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అన్నారు. కాషాయం ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు, ధర్మానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పట్టణ ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడం, దసరా పండుగ శోభను మరింత పెంచడం కోసమే ఈ విరాళాన్ని అందిస్తున్నామని తెలిపారు.కల్వకుర్తి పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ఆలయాల పరిసరాలు, ప్రధాన వీధుల్లో కాషాయ జెండాలు ఎగురవేసి పట్టణానికి ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలని హిందూ ఐక్యవేదిక యోచిస్తోంది. ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారంగా ఈ విరాళం ఉపయోగపడుతుందని బావండ్ల మధు ఆశాభావం వ్యక్తం చేశారు.విరాళం అందజేసినందుకు హిందూ ఐక్యవేదిక సభ్యులు బీఆర్ఎస్ నేతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు మురళీధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వీరెడ్డి మధు, మహేష్ రెడ్డి, రాఘవేందర్, శ్రీను, దామర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


