మర్రిగూడలో వైద్య విద్యార్థుల క్షేత్రస్థాయి శిక్షణ
అనుభవం గడించిన 'పీఎం శ్రీ' విద్యార్థులు మర్రిగూడ సీహెచ్‌సీలో హెల్త్‌కేర్ ఇంటర్న్‌షిప్ వైద్య సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందిన విద్యార్థులు
మర్రిగూడ/నల్గొండ:పుస్తకాల పరిజ్ఞానానికే పరిమితం కాకుండా,భావి భారత వైద్య రంగానికి విద్యార్థులను సన్నద్ధం చేసే దిశగా మర్రిగూడలో కీలక అడుగు పడింది. స్థానిక పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ కు చెందిన హెల్త్‌కేర్ విభాగ విద్యార్థులు మర్రిగూడ సామాజిక ఆరోగ్య కేంద్రం వేదికగా తమ క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.వృత్తి విద్యా కోర్సుల్లో భాగంగా చేపట్టిన ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు ఆచరణాత్మక వైద్య సేవలపై అమూల్యమైన అనుభవాన్ని గడించారు. ఆచరణాత్మక వైద్యంపై అవగాహన.. విద్యార్థులు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి, దైనందిన వైద్య సేవల నిర్వహణను పరిశీలించారు. రోగులకు అందించే ప్రాథమిక చికిత్సల తీరుతెన్నులు, బి.పి,షుగర్ పరీక్షలు చేయడం,ఈసీజీ తీయడం, ల్యాబ్ పరీక్షల నిర్వహణ అలాగే అత్యవసర వైద్య సేవలలో వైద్య సిబ్బంది వ్యవహరించే తీరును విద్యార్థులు ప్రత్యక్షంగా తిలకించి నిపుణుల ద్వారా తెలుసుకున్నారు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు,సిబ్బంది సివిల్ సర్జన్ అసిస్టెంట్ డాక్టర్ శంకర్, పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశం, హెల్త్‌కేర్ ట్రైనర్ లక్ష్మి ప్రత్యేక చొరవ చూపారు. సీహెచ్‌సీ వైద్యులు, వైద్య సిబ్బంది విద్యార్థులకు నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తూ వైద్య రంగానికి సంబంధించిన మెలకువలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెల్త్‌కేర్ విభాగ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.విద్యార్థి దశలోనే వైద్య రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేందుకు ఇలాంటి ఇంటర్న్‌షిప్‌లు ఎంతగానో దోహదపడతాయని, భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిగా ఎదిగేందుకు ఈ శిక్షణ పునాది అవుతుందని ఉపాధ్యాయులు, వైద్యులు అభిప్రాయపడ్డారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


