సోషల్ మీడియాలో ఆయుధాలతో వీడియోలు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులు అరెస్టు రిమాండ్

వైరల్ అయిన వీడియోపై స్పందించిన మావల పోలీసులు , ఆయుధాలతో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు ' కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు' మావల ఇన్స్పెక్టర్ బి డి ప్రేమ్ కుమార్

సోషల్ మీడియాలో ఆయుధాలతో వీడియోలు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులు అరెస్టు రిమాండ్

ఆదిలాబాద్:సోషల్ మీడియాలో ఆయుధాలతో వీడియోలు చిత్రీకరించి పోస్టు చేస్తూ ప్రజల్లోభయాందోళనలు సృష్టించే ప్రయత్నాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని మావల ఎస్హెచ్ఓ బి.డి. ప్రేమ్ కుమార్తె లిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 11వ తేదీన కేఆర్కే కాలనీ, కరీం చికెన్ సెంటర్ సమీపంలో కొందరు వ్యక్తులు కత్తులు, ఆయుధాలతో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మావల ఎస్ఐ కె. రాజశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.విచారణలో *మొహితే వికాస్ (28), బండి శశాంక్ (23)* తమ స్నేహితులైన గైక్వాడ్ లవ్, వంశీ, షెల్కే సందీప్‌లతో కలిసి ఆయుధాలతో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో భయాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో కత్తులు, కత్తుల్లాంటి ఆయుధాలతో వీడియోలు రూపొందించినట్లు విచారణలో వెల్లడైంది. బండి శశాంక్ మోటార్ సైకిల్ విడిభాగాలతో తయారు చేసిన ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలిపాడు. ఆ ఆయుధాన్ని 15 రోజుల క్రితమే గుర్తుతెలియని వ్యక్తికి విక్రయించినట్లు పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి విచారణ చేపట్టారు. వీడియో పోస్టు చేసిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మావల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 695/2026, ఆయుధాల చట్టం సెక్షన్ 4 ఆర్/ డబ్ల్యూ 25(2 బి)(బి) కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసే రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఆయుధాలను ప్రదర్శించడం, వాటితో వీడియోలు చిత్రీకరించి ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని మావల ఎస్హెచ్ఓ బి.డి. ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హక్కుల కోసం ఉద్యమించాలి హక్కుల కోసం ఉద్యమించాలి
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి  పూజ ఉత్సవాలు
అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 
అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,