శివంపేటలో అన్నపూర్ణాదేవి రూపంలో దుర్గాభవాని అమ్మవారి దర్శనం
లక్ష్మి సంధ్యారెడ్డి, లక్ష్మి నరసింహారెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామంలో హనుమాన్ సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దుర్గాభవాని అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా అన్నపూర్ణాదేవికి అన్నప్రాసన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన లక్ష్మి సంధ్యారెడ్డి, లక్ష్మి నరసింహారెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు ఆనందంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ సేన ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలతో శివంపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ రాజి రెడ్డి,బి కిరణ్ గౌడ్ ఎంపీటీసీ, హనుమాన్ సేవ, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


