షార్ట్ సర్క్యూట్ తో దగ్నమైన పూరీ గుడిసె ప్రభుత్వం ఆదుకోవాలి...
చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి 11 గంటలకు కావేటీ మల్లేష్ తండ్రి బాలయ్య వారు ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా కరెంట్ పోలు నుండి ఇంట్లోకి వస్తున్న వైర్ ఒక్క సారి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు రావడంతో మేలుక వచ్చిన కుటుంబ సభ్యులు ప్రాణ భయంతో బయటపడ్డారు.స్థానికులు నీళ్లు తో మంటలు అరపడం చేసిన మంటలు అదుపులోకి రాలేదు ఇంట్లో ఉన్న సామాగ్రి నిత్యవసర సరుకులు, బియ్యం, బట్టలు, దుస్తువులు, కొంత మేరకు ఆర్థిక నష్టం అప్పు తెచ్చుకున్న 50,000 నగదు కాలిపోయాయి తెలియజేశారు.కనీసం తినడానికి బియ్యం కూడా లేకుండా కాలిపోయాయి వేసుకోవడానికి బట్టలు కూడా లేవు మాకు ఎలాగైనా సహాయం అందించాలని ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆర్థికంగా,మరియు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


