పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకుఅవగాహన

భిక్కనూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకుఅవగాహన

 భిక్కనూర్ :  విద్యార్థుల్లో పోలీస్ వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు పోలీసుల విధులు బాధ్యతలను ప్రత్యక్షంగా తెలియజేసేందుకు బిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఎస్సై అనిల్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, ప్రజలకు అందించే సేవల గురించి విద్యార్థులకు వివరించారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు సాంకేతిక పరికరాలు, పెట్రోలింగ్ వాహనాలు, పోలీస్ శాఖకు సంబంధించిన ఇతర సామగ్రిని విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వాటి వినియోగం గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పోలీస్ శాఖ పనితీరును దగ్గరగా తెలుసుకునే అవకాశం లభించింది. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేపట్టే చర్యలు, వారి విధులు, బాధ్యతలపై అవగాహన పొందారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులను సంప్రదించాలని చట్టాలను గౌరవించాలని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.చిన్ననాటి నుంచే విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించి, పోలీస్ శాఖపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించడమే ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
మల్హర్ :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడోత్సవాలు-2026లో మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినీ,...
70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకుఅవగాహన
షీ టీమ్స్ నిఘా.. 75 మందికి కౌన్సెలింగ్
ఘనంగా మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు
న్యాయ సహాయంతో సంక్షేమ పథకాలు అందరికీ అందాలి: డి. ఇందిరా ‎