చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం

స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమని వెల్లడి

చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం

చౌటకూర్ :  గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చౌటకూర్ మండలం కేంద్రంలో కార్పొరేట్ స్థాయి డిజిటల్ విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రముఖ సినీ నటి, సామాజిక కార్యకర్త మంచు లక్ష్మి ముందుకు సాగుతున్నారు. ఆమె స్థాపించి నిర్వహిస్తున్న 'టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్' ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను మంచు లక్ష్మి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తన చిన్ననాటి పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలను స్మార్ట్ క్లాస్‌రూమ్‌లుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది 'టీచ్ ఫర్ చేంజ్' ట్రస్ట్ ద్వారా 364కు పైగా పాఠశాలలను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి, వాటిని సమకూర్చేందుకు తమ బృందం కృషి చేస్తోందని తెలిపారు.

మారుమూల ప్రాంతాల్లోనూ సేవా కార్యక్రమాలు

ఒక పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం అంత సులభమైన విషయం కాదని, అయినప్పటికీ తమకు సాధ్యమైనంత వరకు సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్నామని మంచు లక్ష్మి పేర్కొన్నారు. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో విద్యా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో చిన్నపాటి ప్రయత్నం చేసినా విద్యార్థుల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు.

విద్యతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం

విద్యార్థులకు సైన్స్, గణితం వంటి సబ్జెక్టులతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆంగ్ల ఉచ్చారణపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంచు లక్ష్మి సూచించారు. వీటి ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, ఉన్నత స్థాయి నాయకులుగా ఎదగాలనే నమ్మకం, ధైర్యం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

సమాజంలో మంచి సంకల్పంతో పనిచేస్తే ఎంతోమంది దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు సహకరించేందుకు ముందుకు వస్తారని మంచు లక్ష్మి అన్నారు. అందరి సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, వాలంటీర్లకు, సహకారం అందిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజుల సుభాష్ బాబు, మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఎంఈఓ అనురాధ, ఉపాధ్యాయులు, సంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు నందికంటి రామచంద్ర రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ రామా గౌడ్,వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి, చక్రపాణి, గోరేమియా, అశోక్,తదితరులు పాల్గొన్నారు.

Views: 59

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే