దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి

కాటారం సబ్ డివిజన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌డీపీఓ ఏ. సూర్యనారాయణ

దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి

కాటారం (భూపాలపల్లి) :  దీపావళి పండుగను పురస్కరించుకొని కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఏ. సూర్యనారాయణ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దీపావళి పండుగకు సంబంధించి బాణసంచా విక్రయించే వ్యాపారస్తులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.
కాటారం సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాలు, మండల కేంద్రాల్లో బాణసంచా విక్రయ స్టాళ్లు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి ఎన్‌ఓసీ, అగ్నిమాపక శాఖ అనుమతి, వాణిజ్య పన్నుల శాఖ నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖ అనుమతి, గ్రామపంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఎంత చిన్న మొత్తంలో బాణసంచా విక్రయించినా అన్ని అనుమతులు పొందిన తర్వాతే స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రజలు బాణసంచా కాల్చే సమయంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య సురక్షితంగా జరుపుకోవాలని ఎస్‌డీపీఓ ఏ. సూర్యనారాయణ కోరారు.

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం