మృతురాలి కుటుంబానికి ఏవీ రెడ్డి ఆర్థిక సాయం
నాంపల్లి మండలంలోని చిట్టంపహాడ్ గ్రామానికి చెందిన బల్సుల భాగ్యమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏవీ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భాగ్యమ్మ మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు నాగ శ్రవణ్‌కు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నాయిని జగన్‌మోహన్ రెడ్డి, అబ్బనబోయిన చందు యాదవ్, నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్, యువ నాయకుడు గజ్జెల శివారెడ్డి, మహమ్మదాపురం మాజీ సర్పంచ్ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, సపావత్ సర్దార్, గజ్జెల గెల్వాల్ రెడ్డి, గ్రామస్థులు అంజయ్య, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


