పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే
బిజినపల్లి(నాగర్ కర్నూల్) : నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూములకు సోమవారం మండల సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే నిర్వహించారు.ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ దేవస్థాన భూములకు సంబంధించి ఎటువంటి ఆక్రమణలు జరగకుండా, భూముల రక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ డిజిటల్ సర్వేను చేపట్టింది. అత్యాధునిక డిజిటల్ పరికరాలు, GPS టెక్నాలజీ ద్వారా ఆలయానికి చెందిన ప్రతి ఎకరా భూమిని క్షుణ్ణంగా కొలతలు వేసి, వాటి సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించారు. ఈ సర్వే ద్వారా దేవస్థాన భూములకు సంబంధించిన పూర్తి రికార్డులను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆలయ భూములకు రక్షణ కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోవిందు రామకృష్ణ, కొంకలి యాదగిరి, కుర్మయ్య, నాగయ్య, దశరథం, శంకర్, బీరయ్య, రాము తదితరులు పాల్గొని సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఆలయ భూముల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


