చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన

విరాసత్ – 2026’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు భారతీయ శాస్త్రీయ నృత్యంపై అవగాహన

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన

చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కథక్ నృత్య ప్రదర్శన నిర్వహించారు.
‘విరాసత్ – 2026’ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి  ఆర్తి శంకర్ విద్యార్థులకు కథక్ నృత్యంపై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడంతో పాటు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కథక్ నృత్య విశిష్టత, దాని ప్రాచీన చరిత్ర, భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయంలో దాని ప్రాముఖ్యతను ఆమె ప్రదర్శన ద్వారా వివరించారు. నృత్యంలోని విభిన్న హావభావాలు, లయ, తాళం, పాద విన్యాసాలను ప్రదర్శిస్తూ విద్యార్థులకు ఈ కళారూపంపై సమగ్ర పరిజ్ఞానాన్ని అందించారు.పాఠ్యాంశాలతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవం, అవగాహన పెరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి  అనురాధ, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం