కొత్తగూడెంలో ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు బహిరంగ వేలం.
వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 27న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్, ఖమ్మం ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్‌లో ఈ వేలం జరగనుంది.
వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గలవారు 50 శాతం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ వి. రాజశేఖర్ తెలిపారు. వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ఆధార్ కార్డు, పాన్ కార్డులను వెంట తీసుకురావాలని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

