గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
ఐఎన్ టి యు సి నాయకుల హామీ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, ఆధ్వర్యంలో
మల్హర్ : హైదరాబాద్, నవంబర్ 24 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, ఇతర గ్రామపంచాయతీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐ ఎన్ టి యు సి ముఖ్య నాయకులు హామీ ఇచ్చారు.ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధ ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై కీలక చర్చలు నిర్వహించారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐ ఎన్ టి యు సి ముఖ్య ఉపాధ్యక్షులు మొగిల్లా రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగయ్య, గౌడ్‌లను కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి నాయకులు స్పందిస్తూ గ్రామపంచాయతీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత ప్రభుత్వ పెద్దలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల హక్కుల సాధన, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఐ ఎన్ టి యూ సి ఎల్లప్పుడూ అండగా నిలిచి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చి భరోసా కల్పించిన ఐ ఎన్ టి యు సి ముఖ్య నాయకులకు తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తరఫున అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతుల సత్యం, తోలుకునూరి అశోక్, మేదరి రాజేందర్, నాగనబోయిన శ్రీనివాస్, గౌడ రాజమహేందర్, నాగరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


