మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు
చేర్యాల : మండలంలోని రాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా భవనం పనులతో పాటు గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన గణేష్ సోమవారంప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ శెట్టి కొమురయ్య వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రణయ్‌కు వినతిపత్రంఅందజేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా భవనం పనులను సర్పంచ్ స్వయంగా కాంట్రాక్టుతీసుకుని, నిర్మాణ సామగ్రి రవాణా కోసం గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్‌నువినియోగించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బందిని సైతం వ్యక్తిగత నిర్మాణ పనులకుఉపయోగించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.అలాగే గ్రామ ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ట్యాంకును వినియోగించుకున్నప్పటికీ సంబంధిత బిల్లులు చెల్లించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కూడా సర్పంచ్ కాంట్రాక్టు తీసుకుని నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేపడుతున్నారని ఫిర్యాదులో వివరించారు.ఈవ్యవహారాలన్నింటిపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గణేష్ కోరారు.గ్రామపంచాయతీ నిధులు, వనరుల వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు చేపట్టబోయే విచారణపై గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


