ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా విధులు నిర్వహించాలి.tle
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. గంభీరవుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
గంభీరావుపేట : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గంభీరవుపేట పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు, నిర్వహణ రికార్డులు, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం ఎస్పీ మహేష్ బి గీతేమాట్లాడుతూ...ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులలో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు.స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ గారి వెంట డిఎస్పీ నాగేంద్రచారి, ఎస్.ఐ బాలరాజు సిబ్బంది ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


