కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వెంకటస్వామి, పాల్వాయి హరీష్ బాబు

కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు  గడ్డం వినోద్ వెంకటస్వామి,   పాల్వాయి హరీష్ బాబు

బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా ) :  బెల్లంపల్లిపట్టణంలోని 2 గ్రౌండ్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు. ఇరువురు ఎమ్మెల్యేలు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ కార్తీక మాసం హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైనదని, భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కార్తీక దీపోత్సవం వంటి కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సంప్రదాయాలను కాపాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న హిందూ ఉత్సవ సమితి నిర్వాహకులను అభినందించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి–రమేష్ బాబు దంపతులు, హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
మక్తల్ :  నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.