కొండపాకలో నేడే అంగరంగ వైభవంగా ఘనంగాఎల్లమ్మ కళ్యాణం, బోనాల పండుగ
సిద్దిపేట జిల్లా ప్రతినిధి సిద్దిపేట జిల్లా కేంద్రంలో గల కొండపాక మండలం లో గల అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో శివాలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు విద్యుత్తు లైట్లతో అలంకరణ చేసి గ్రామస్తులందరూ ఎల్లమ్మ తల్లి మొక్కులు చెల్లించుకుని ఆనవాయితీ. ఆదివారము నుండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అని సంఘం అధ్యక్షులు అంబటి రాజు తెలిపారు ఈరోజు అమ్మవారికి ఘనంగా బోనాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని గ్రామంలో మహిళలందరూ బోనాలను తీసుకువచ్చి అమ్మవారికిసమర్పించనున్నట్లుతెలిపారుఅనంతరంకొండపాకగ్రామ సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలోని ఆడబిడ్డలందరినీ పిలిచి ఓడు బియ్యం పోయడం లాంటి కార్యక్రమాలు వారిఇండ్లలోనిర్వహించుకుంటారని తెలిపారు. కొండపాకలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ తల్లికళ్యాణమహోత్సవం, బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కలుసుకుంటామని. గ్రామంలో నుండి ఆలయం వరకు అందరూ అమ్మవారికి వివిధ రకాల వంటలను తీసుకువెళ్లి నైవేద్యంగా సమర్పిస్తారని తెలిపారు ఆలయాన్ని ప్రాంగణంలో పువ్వులతో విద్యుత్ దీపాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు, పూజలు చేసిఅమ్మవారి కళ్యాణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని తెలిపారు గ్రామంలోని మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గౌడ సంఘం అధ్యక్షులు అంబటి రాజు ఉపాధ్యక్షులు. అంబటి భానుచందర్ గౌడు కార్యవర్గ సభ్యులు మారమైన రాములు గౌడ్ పరిశరాములు గౌడ్ . బొలగం భాను ముస్తాల రమేష్ మల్లెల రాములు గౌడ్ మంచాల బాలకిషన్ గౌడ్ బొలగం తిరుపతి పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


