సుల్తాన్‌పూర్ మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?

పగలంతా ప్రశాంతంగా రాత్రి వేళలో మరువందంగా జోరుగా మైనింగ్ అధికారుల పర్యవేక్షణ ఏదీ? చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్!

సుల్తాన్‌పూర్  మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?

చౌటకూర్ :  చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో రాత్రివేళల్లో మొరం తవ్వకాలు, రవాణా విచ్చలవిడిగా సాగుతున్నాయంటూ స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో హైవేపై భారీ వాహనాలు మొరాన్ని తరలిస్తూ అతివేగంగా ప్రయాణిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.పగటిపూట ప్రశాంతంగా కనిపించే ప్రాంతంలో రాత్రి వేళల్లో మాత్రం మొరం రవాణా జోరుగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. పలు వెంచర్లకు పెద్ద మొత్తంలో మొరం అవసరం ఉండటంతో పాటు, పెట్రోల్ బంకులు, ఇతర ప్రైవేట్ నిర్మాణ ప్రాంతాలకు కూడా మొరం తరలిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.ఈ వ్యవహారంపై మైనింగ్ శాఖ అధికారులు ఎక్కడ ఉన్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రాత్రివేళల్లో ఇంత పెద్ద ఎత్తున మొరం రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. తమ గ్రామం మీదుగానే భారీ వాహనాలు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించినా సంబంధిత అధికారుల నుంచి సరైన స్పందన రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.ఇకనైనా మైనింగ్ శాఖ అధికారులు స్పందించి, మొరం తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్‌ పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్‌
ప్రజలకు మెరుగైన సేవలు అందించే సమర్థవంతమైన అధికారులుగా ఎదగాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శిక్షణ డీఎస్పీలకు దిశా నిర్దేశం* ఆదిలాబాద్ బ్యూరో నవంబర్ 23...
జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!
సుల్తాన్‌పూర్ మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?
గుడిపేట వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక
మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం: