తమిళనాడుకు చేరుకున్న ఇందూరు అయ్యప్పల పాదయాత్ర
నిజామాబాద్ : ఇందూరు నుంచి శబరిమల వరకు అక్టోబర్ లో ప్రారంభించిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆదివారం తమిళనాడుకు చేరుకుంది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్వాములందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆటంకం లేకుండా శబరిమల వరకు విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఇందూరు శ్రీధర్మశాస్త్ర పాదయాత్రను జ్ఞానేశ్వర్ గురుస్వామి నేతృత్వంలో కొనసాగుతుంది. మొత్తం 40 మంది అయ్యప్ప స్వాముల బృందం ఇప్పటి వరకు సుమారు 850 కిలో మీటర్లు నడిచారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను దాటుకొని తమిళనాడులోకి ప్రవేశించారు. పాదయాత్రలో 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ 18 వ వార్డు కౌన్సిలర్ శ్రవణ్ కుమార్, స్వాములు మధు, శ్రీనివాస్, అజయ్, గంగా ప్రసాద్ తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


