విజన్ ఆంధ్ర ముందస్తు హెచ్చరిక నిజమైంది.. అంతలోనే రోడ్డు ప్రమాదం! ప్రమాదాలకు ముందే అప్రమత్తం చేసిన విజన్ ఆంధ్ర.. అయినా మారని పరిస్థితి!
అంతర్రాష్ట్ర రహదారిపై వరి ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విజన్ ఆంధ్ర పత్రిక ముందుగానే ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తూ వార్త ప్రచురించింది. అయితే ఆ వార్త ప్రచురించిన కొద్ది సమయంలోనే అదే రహదారిపై ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల ప్రాణాల కంటే ధాన్యం ఆరబెట్టడం ముఖ్యమా? రహదారులను ప్రమాదకరంగా మార్చకుండా రైతులు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకోవాలని, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విజన్ ఆంధ్ర కథనం కేవలం వార్త కాదు.. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ముందస్తు హెచ్చరిక!
11:32 am
ముందుగానే హెచ్చరించిన విజన్ ఆంధ్ర.. అంతలోనే జాతీయ రహదారిపై ప్రమాదం! రోడ్డుపై వడ్లు ఆరబెట్టడమే ప్రమాదాలకు కారణమా? అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన మిడ్జిల్ : ఆంధ్ర జాతీయ రహదారిపై వరి ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విజన్ ఆంధ్ర పత్రిక ముందుగానే హెచ్చరించింది. అయినప్పటికీ, ఆ హెచ్చరిక వెలువడిన కొద్ది సమయంలోనే మిడ్జిల్ మండలం వాడ్యాల్ ధాబాల ఎదురుగా 167వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో మిడ్జిల్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న AP40KD8866 నంబర్ గల కారు, AP22L1442 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. రోడ్డుపై వరి ధాన్యం ఆరబెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై విజన్ ఆంధ్ర పత్రిక ప్రజలను, సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ కథనం ప్రచురించింది. అయినప్పటికీ రహదారులపై ధాన్యం ఆరబెట్టే పరిస్థితి కొనసాగడం, ప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులు ప్రయాణానికి తప్ప ధాన్యం ఆరబెట్టడానికి కాదని, రైతులు రహదారులపై వడ్లు ఆరబెట్టకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలను వినియోగించాలని ప్రజలు సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారులపై ధాన్యం ఆరబెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ప్రమాదం జరగకముందే నివారించడం ముఖ్యం. ప్రజల ప్రాణాల రక్షణకు అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.
Views: 47
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Nov 2026 17:41:55
మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
