కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం:
డిసెంబర్ 1, 2 , 3 తేదీలలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో డిసెంబర్ 1,2,3 తేదీలలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో వివిధ రంగాల కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ వాల్ పోస్టర్లు , కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం బడా పెట్టుబడిదారులు , కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడం కోసం కార్మికులను కట్టు బానిసలు చేసే విధంగా కార్మిక చట్టాలను మార్చిందని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ ల ను రద్దు చేయాలని , కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని , కార్మికులందరికీ కనీస వేతనం అందించాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని , పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని తదితర డిమాండ్లతో CITU ఆధ్వర్యంలో డిసెంబర్ 1, 2, 3 తేదీలలో లక్షలాదిమంది కార్మికులతో చేపట్టనున్న చలో ఢిల్లీ , పార్లమెంటుకు వెళ్దాం కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ రంగాల కార్మికులు దాదాపు 100 మంది ఢిల్లీకి తరలి వెళ్లడం జరుగుతుందని కార్మిక చట్టాల , హక్కుల పరిరక్షణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం కోసం తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు , అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు రాపెల్లి రమేష్ , గోవిందు లక్ష్మణ్ , బుర్ర శ్రీనివాస్ , కోడం వేణు , మరికంటి నర్సయ్య , హరిదాసు, రమేష్ , ప్రభాకర్ , శేఖర్ , శ్రీనివాస్ , రాములు , యాదగిరి , కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


