అర్హుల ఇళ్లను మాయం చేస్తే ఊరుకునేది లేదు!

మాజీ ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి ఆగ్రహం ప్రతి కుటుంబానికి ఆర్‌అండ్‌ఆర్, పునరావాస స్థలం ఇవ్వాలని డిమాండ్

అర్హుల ఇళ్లను మాయం చేస్తే ఊరుకునేది లేదు!

మల్హర్, : మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసీపీ బ్లాక్‌-1కు 500 మీటర్ల డేంజర్ జోన్ పరిధిలో ఉన్న నివాస గృహాల సేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పరిహారం, పునరావాసం కోసం సోమవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అర్హులైన స్థానికుల పేర్లను డ్రాఫ్ట్ డిక్లరేషన్‌లో తొలగించడం పై తాడిచర్ల మాజీ ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల్లో ఉన్న ఇళ్లను జాబితా నుంచి తొలగించి నిర్వాసితులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 2022 పీఎన్‌లో నమోదైన ఇళ్ల సంఖ్యకు, ప్రస్తుత డ్రాఫ్ట్ డిక్లరేషన్‌లో చూపిన ఇళ్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసం తగ్గడంపై అధికారుల తీరును ప్రశ్నించారు. ఇంటి పన్ను రసీదులు పేరుతో స్థానికులకు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. గత దశాబ్దకాలంగా ఓసీపీ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో అనేక మంది నిర్వాసితులు అనారోగ్య సమస్యలకు గురయ్యారని, పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీపీ బ్లాస్టింగ్ ప్రభావంతో ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని, అనేక ఇబ్బందులను భరిస్తూ జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్హులైన స్థానికుల పేర్లనే డ్రాఫ్ట్ డిక్లరేషన్‌లో తొలగించడం బాధాకరమన్నారు. సోషల్ ఎకనామిక్ సర్వే పేరుతో ప్రతి స్థానిక నిర్వాసితుడి నుంచి పత్రాలు సేకరించి, చివరకు కేవలం 847 కుటుంబాలనే గుర్తించడం ఏమిటని ప్రశ్నించారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ కొండలు తవ్వి ఎలుకను పట్టిన చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారులు పునరాలోచించి మానవీయ కోణంలో సర్వేను సమీక్షించి, స్థానిక నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని 2026 కటాఫ్ తేది తో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ రెండు గుంటల చొప్పున పునరావాస స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. మంథని మండలం రచ్చపల్లి తరహాలో పునరావాస స్థలాలను అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి నిర్వాసితులకు అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయకపోతే భూనిర్వాసితుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని రావుల కల్పనా మొగిలి హెచ్చరించారు.

Views: 67

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
మక్తల్ :  నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.