*పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్‌లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కలిసి సన్మానించారు.

*పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్‌లో  ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కలిసి సన్మానించారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ లతో పాటు, మాజీ ఎంపీ సోయం బాపు రావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి , బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ ,  ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,మాజీ టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత , మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డిసిసి సాజిద్ ఖాన్ ,మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి  జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  ను మర్యాదపూర్వకంగా కలిశారు.* 

ఆదిలాబాద్ బ్యూరో : ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో చర్చించి, ప్రతిపాదించిన పలు కీలక అంశాలను ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి, వాటిపై సమగ్రంగా చర్చించారు.
ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ప్రజలకు మరింత చేరువ కావడం, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం వంటి అంశాలపై చర్చించారు.
అదేవిధంగా, ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడంతో పాటు అధిక సంఖ్యలో ఆదివాసీ, గిరిజన ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో, జిల్లాలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా ఇళ్లను కేటాయించాలని డి సి సి అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్  పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లాలోని నిరుపేద కుటుంబాలు, గిరిజన ప్రాంతాల ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆదిలాబాద్ జిల్లాకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
అలాగే, జిల్లా పీఏసీ సమావేశంలో చర్చించిన ఇతర ప్రజా సమస్యలు, పార్టీ సంస్థాగత బలోపేతానికి సంబంధించిన అంశాలను కూడా పీసీసీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి రాష్ట్ర పార్టీ నాయకత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) సభ్యులు, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరం సత్యవతి కోటేష్,బోత్ ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏలేటి అశ్విన్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పరమేశ్వర్, జిల్లా కాంగ్రెస్  ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు మునిగేల నర్సింగ్,జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి, సోనాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాజుల పోతన్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ pac సభ్యులు ఉన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై  ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
మల్హర్ : హైదరాబాద్, నవంబర్ 24 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, ఇతర గ్రామపంచాయతీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి...
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.
జలయజ్ఞం అంటే శంకుస్థాపనల యజ్ఞమా? - విజయ్ రామ్ నాయక్