మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : కాసిపేట మండలం కాసిపేట 1వ ఇంక్లైన్లోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ ఆఫీసర్, ఏఐటీయూసీ కాసిపేట పిట్ కార్యదర్శి దాగం మల్లేశ్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Views: 16
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
24 Nov 2026 17:41:55
మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
