సర్ పేరుతో ఓటర్ల హక్కులను హరించే కుట్రపై బీజేపీ సమాధానం చెప్పాలి

ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలకు బీజేపీ బాధ్యత వహించాలి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సర్ పేరుతో ఓటర్ల హక్కులను హరించే కుట్రపై బీజేపీ సమాధానం చెప్పాలి

హుస్నాబాద్  :  ఓటర్ల తొలగింపులు, ఎన్నికల డేటా మార్పులు, ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బీజేపీకి ఉందా అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.ఓటర్ల జాబితాను మెషిన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఎందుకు అందించడం లేదు? ఎన్నికల డేటా అందుబాటులో లేకుండా చట్ట సవరణలు ఎందుకు? సర్ పై పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చించడానికి బీజేపీ ఎందుకు భయపడుతోందన్నారు.
చొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కాంగ్రెస్ అడగడం లేదు,చొరబాట్లు జరగకుండా కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు.

కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది.. చొరబాటుదారులు ఓటర్లుగా ఎలా మారుతున్నారో సమాధానం చెప్పాలి


కరీంనగర్ కి వచ్చి రాహుల్ గాంధీ ని విమర్శించడం కాదు.తెలంగాణకు 12 ఏళ్లలో చేసిన అభివృద్ధి, కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులపై సమాధానం చెప్పాలన్నారు.కేంద్రంలో ఉన్న పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో యాత్రలు చేయడం సిగ్గు చేటన్నారు.
సర్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పేదలు, మైనారిటీలు, బలహీన వర్గాల ఓటు హక్కును హరించే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చొరబాటుదారుల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతల వైఖరిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా తీవ్రంగా విమర్శించారు.నిన్న కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, స్థానిక సమస్యలు, ప్రాంత అభివృద్ధి, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రజల కనీస అవసరాల గురించి మాట్లాడకుండా రాహుల్ గాంధీని విమర్శించడం, ఢిల్లీ రాజకీయాలు, మతపరమైన భావోద్వేగాలు, విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తగదన్నారు.నిన్న కరీంనగర్ సభలో శబ్ద కాలుష్యం తప్ప సబ్జెక్టు లేదు, విషయం లేదనీ విమర్శించారు.రాహుల్ గాంధీ అడుగుతున్నట్టుగా సర్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? దానికి ఎవరు ఆమోదం తెలిపారు? ఓటర్ల డేటాలో మార్పులు ఎవరు చేశారు? ఓటర్లను ఏ ప్రాతిపదికన తొలగించారు? ఫారం-6లో జరిగిన మార్పులు, ఓటర్ల తొలగింపులకు సంబంధించిన పూర్తి రికార్డులను ఎందుకు అందించడం లేదు? ఓటర్ల జాబితాను మెషిన్ రీడబుల్ ఫార్మాట్‌లో ప్రజలకు, రాజకీయ పార్టీలకు ఎందుకు అందించడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తప్పించారు?ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్రంగా పనిచేయాల్సిన రాజ్యాంగ సంస్థ. అలాంటి సంస్థ నియామక ప్రక్రియలో స్వతంత్రతను బలహీనపరిచి, కేంద్రంలోని పాలకుల ప్రభావానికి లోనయ్యే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని నిలదీశారు.ఎన్నికల డేటా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే విధంగా ఎన్నికల కమిషన్ చట్టంలో సవరణలు ఎందుకు చేశారు? సర్ అంశంపై పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్చించడానికి బీజేపీ ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.ఉత్తరప్రదేశ్‌లో కోటి మంది ఓటర్ల తొలగింపుపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేయలేదా? బీజేపీ అగ్రనాయకుడు ఎల్.కే. అద్వానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సైనిక కుటుంబాలకు సంబంధించిన ఓట్ల విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ నోటీసులు ఇవ్వలేదా? ఇండియా కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాతే అద్వానీ వంటి ప్రముఖుల ఓటు హక్కును కొనసాగించేందుకు చర్యలు తీసుకోలేదా? బతికి ఉన్న ఓటర్లను తొలగించిన ఘటనలను రాహుల్ గాంధీ పలు రాష్ట్రాల్లో ఆధారాలతో చూపిస్తున్నప్పటికీ, వాటిపై సమాధానం చెప్పకుండా బీజేపీ నేతలు తప్పించుకోవడం సిగ్గుచేటన్నారు.చొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కాంగ్రెస్ పార్టీ అడగడం లేదని, అక్రమ చొరబాట్లు జరగకుండా కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు చొరబాటుదారులు ఓటర్లుగా ఎలా మారుతున్నారని సమాధానం చెప్పాలన్నారు. బీహార్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణకు వచ్చి ఏదో మాట్లాడటం కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన అభివృద్ధి గురించి వివరించాలని సూచించారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పర్యటించడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే గత 12 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో, రాష్ట్ర అభివృద్ధికి ఎంత మేర సహకరించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు సహకరిస్తామని చెప్పి, అభివృద్ధి అంశాలను పక్కన పెట్టి బీజేపీ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు అంగీకరించరన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిరోధకులుగా మారే రాజకీయాలకు బీజేపీ స్వస్తి పలకాలని హితవు పలికారు. కేవలం మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.రాజ్యాంగం తమ గుండెల్లో ఉందని చెప్పుకునే బీజేపీ నేతలు, అదే రాజ్యాంగానికి బలమైన పునాదులుగా ఉన్న ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు బీజేపీ రాజకీయ సంస్కృతిగా మారాయని విమర్శించారు.
రాజ్యాంగాన్ని మార్చాలంటూ గతంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాల కోసం దేశ సంపదను వినియోగిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ, నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, రూపాయి విలువ పతనం, సామాన్యులపై పన్నుల భారంపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని చేస్తున్న పోరాటాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న బీజేపీ నేతలు, అధికారంలో ఉన్న తమ ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉందని గుర్తించాలన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేస్తున్న వ్యాఖ్యలకు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు పొంతన లేదన్నారు. నితిన్ నబీన్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా భావోద్వేగాలు, విద్వేష రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సాగవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
మక్తల్ :  నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.