బుగ్గ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న సబ్ కలెక్టర్
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు
బెల్లంపల్లి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ మంగళవారం బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అర్చనలు, పూజలు చేసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సబ్ కలెక్టర్‌కు దేవాలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అభిషేకం అనంతరం ఆలయ మండపంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి గర్రెపల్లి వేణుగోపాల్ గుప్త ఉప కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. అర్చకులు సతీష్ శర్మ ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తహసీల్దార్ ఎల్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


