బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

ఫిర్యాదుల విచారణలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలి

బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మెదక్, ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించారు. ఆయా సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా, విచారణ పురోగతిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎస్పీ సూచించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్‌ పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్‌
ప్రజలకు మెరుగైన సేవలు అందించే సమర్థవంతమైన అధికారులుగా ఎదగాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శిక్షణ డీఎస్పీలకు దిశా నిర్దేశం* ఆదిలాబాద్ బ్యూరో నవంబర్ 23...
జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!
సుల్తాన్‌పూర్ మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?
గుడిపేట వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక
మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం: