జలయజ్ఞం అంటే శంకుస్థాపనల యజ్ఞమా? - విజయ్ రామ్ నాయక్
aములుగు, : కాంగ్రెస్ నేత గణపాక సుధాకర్ బహిరంగ సవాల్‌కు బీఆర్ఎస్ నేత, ఎక్స్ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు పోరిక విజయ్ రామ్ నాయక్ బహిరంగ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ వేసింది పునాదులు కాదు, శంకుస్థాపన శిలాఫలకాలని, 2004-2014 మధ్య పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రైతుకు నీరివ్వలేదని విమర్శించారు. కంతనపల్లిని సమ్మక్క సాగర్‌గా మార్చడం వెనుక కమీషన్ కాదు, సాంకేతిక కారణాలు, ప్రజలకు లాభం చేకూర్చడమే ఉందని చెప్పారు. సమ్మక్క సాగర్ వల్లే దేవాదులకు 365 రోజులు నీరు వచ్చిందని, కాళేశ్వరం వల్ల ములుగులో భూగర్భ జలాలు పెరిగి రైతు రెండు పంటలు పండించాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండేళ్లుగా కాళేశ్వరం, దేవాదుల పంపులు ఆపి రైతును మళ్లీ వర్షంపై ఆధారపడేలా చేసిందని ఆరోపించారు. బహిరంగ చర్చకు సిద్ధమని, శిలాఫలకాలు కాదు, రెండేళ్లలో ఇచ్చిన నీటి లెక్కలు పట్టుకుని రావాలని సవాల్ విసిరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

