ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గూర్జ గ్రామంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు..*
-అధినేత్రి కవిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిక –బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గూర్జ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్,కాంగ్రెస్ పార్టీల నాయకులు పలువురు టీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్‌లోని టీ ఆర్ ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా అధ్యక్షులు బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు* సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ *తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అధినేత్రి కల్వకుంట్ల కవితక్క * ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం కావడానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని నూతనంగా చేరిన నాయకులకు సూచించారు. ఈ చేరికలతో గూర్జ గ్రామంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం మండల నాయకులు టీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


