గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్ బీఎం సందీప్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ .
- ఆదిలాబాద్ బ్యూరో : హైదరాబాద్ గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా నియమితులైన బీఎం సందీప్ కుమార్ ను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.*
ఈ సందర్భంగా నూతన ఇన్‌చార్జ్ బీఎం సందీప్ కుమార్ కు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించడం, నాయకులు, కార్యకర్తల సమన్వయం, రాబోయే రాజకీయ కార్యాచరణ తదితర కీలక అంశాలపై వారితో సవివరంగా చర్చించారు. *జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా చర్చించారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Nov 2026 17:41:55
మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
