డి-అడిక్షన్ సెంటర్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

డి-అడిక్షన్ సెంటర్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ 

 వ్యసనగ్రస్తులకు వైద్య చికిత్స కల్పించి, గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం 

గంజాయి కి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన

వ్యసనాన్ని మర్చిపోవాలని క్రీడా సామాగ్రి అందజేత.

గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం అందించిన వారికి నగదు రివార్డు అందజేస్తానని ప్రకటన.

ఆదిలాబాద్ బ్యూరో నవంబర్ 24 (విజన్ ఆంధ్ర)గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలతో పాటు వ్యసనగ్రస్తులకు వైద్య చికిత్స అందించి వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం స్థానిక డి-అడిక్షన్ సెంటర్ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలు, వ్యసనగ్రస్తులకు అందించనున్న కౌన్సెలింగ్, పునరావాస సేవలపై వైద్య బృందంతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి సరఫరా, విక్రయం, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గంజాయికి బానిసైన వారిని గుర్తించి వారికి శాస్త్రీయ పద్ధతిలో వైద్య చికిత్స, మానసిక కౌన్సెలింగ్ అందించడం ద్వారా శాశ్వతంగా వ్యసనం నుంచి బయటపడేలా చేయడం అత్యంత అవసరమని అన్నారు. శిక్షతో పాటు సంస్కరణ కూడా సమాజానికి అవసరమని, అందుకే జిల్లా పోలీస్ శాఖ సమక్షంలో డి-అడిక్షన్ చికిత్సను పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి, మత్తు పదార్థాలకు బానిస అయిన వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వచ్ఛందంగా డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చికిత్స అనంతరం మళ్లీ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా నిరంతర కౌన్సెలింగ్, పర్యవేక్షణ కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా వైద్య అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లాను నిర్మించగలమని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. గంజాయి వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా బాధితులకు క్రీడ సామాగ్రి అందజేసి ప్రోత్సహించారు అదేవిధంగా గంజాయి పై సమాచారం అందించిన వారి కి నగదు రివార్డులను అందజేస్తూ ప్రశంసించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐ బి.డి. ప్రేమ్ కుమార్, టూ టౌన్ ఎస్ఐ ఎస్ జీవన్ రెడ్డి, నూతన శిక్షణా డీఎస్పీలు సామ సాత్విక, సిద్ధోజి రాణి, ఆర్. ఆదిత్య, నాతి యువిక మిత్ర, డి-అడిక్షన్ సెంటర్‌కు చెందిన సిబ్బంది చంద్రశేఖర్ రెడ్డి, దేవేంద్ర, కల్పన, వైద్యులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
మక్తల్ :  నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.